Month: May 2024

మూడేళ్లలో 50 లక్షల చెట్ల నరికివేత!

దేశంలో గడిచిన మూడేళ్లలోనే 50 లక్షల వృక్షాలు అంతర్ధానమైనట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. మధ్యభారతం, మహారాష్ట్రలో చెట్ల నరికివేత పెరిగినట్టు తెలిపింది. వ్యవసాయ భూముల్లో వరి, గోధుమ వంటి పంటలను వేయడానికి వృక్షాలను పెద్ద ఎత్తున నరికేసినట్టు అధ్యయనం పేర్కొంది. సాగు…

చెప్పుల వ్యాపారి ఇంట్లో రూ.100 కోట్లు సీజ్

యూపీలో చెప్పుల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో చెప్పుల వ్యాపారుల ఇళ్లల్లో ఏ మూలన చూసినా నోట్ల కట్టలే దర్శనమివ్వడంతో షాక్ అయ్యారు. ఆగ్రాలోని ముగ్గురు చెప్పుల వ్యాపారులకు చెందిన 14 ప్రాంతాల్లో ఐటీ…

ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత

ఆరోగ్యశ్రీ కింద రోగులకు అందించిన చికిత్స బిల్లులను ప్రభుత్వం చెల్లించట్లేదని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) సోమవారం వెల్లడించింది. ‘గత ఆగస్టు నుంచి ఈ బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. వీటి విలువ సుమారు రూ.1,500కోట్ల వరకు ఉంది. ఇప్పటివరకు చెల్లించలేదు.…

నేరుగా ఫైనల్లోకే.. నేడు క్వాలిఫయర్ మ్యాచ్..!

ఐపీఎల్లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. అగ్రస్థానంలో ఉన్న కోల్కతా, రెండో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ మధ్య నేడు క్వాలిఫయర్-1 జరగనుంది. బాదుడు పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో ప్రవేశిస్తుంది. ఆదివారమే చివరి లీగ్…

TG : మళ్లీ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు షురూ…

ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులు అరెస్టు కాగా… ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్టీ ప్రభాకర్రావు, శ్రవణవు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు.…

మళ్లీ తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం… భయాందోళనలో భక్తులు…

తిరుమలలో మరోసారి చిరుతలు కలకలం రేపాయి. తాజాగా, అలిపిరి నడకమార్గంలో రెండు చిరుతలు కనిపించాయి. వాటిని చూసిన భక్తులు భయంతో గట్టిగా కేకలు వేశారు. ఆ శబ్ధానికి రెండు చిరుతలు అడవిలోకి పారిపోయాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలిపిరి నడక…

ఛత్తీస్ గఢ్ : 20 అడుగుల లోతులో పడిపోయిన వ్యాన్… 17 మంది మృతి…

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం కవార్ధా ప్రాంతంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బహపనీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్ బోల్తా పడడంతో 17 మంది దుర్మరణం చెందగా ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు, ఆరోగ్య…

సింగపూర్ లో కోవిడ్-19 కొత్త వేవ్‌… ప్రజలకు మాస్క్‌లు ధరించమని సలహా…

ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ శనివారం మళ్లీ ముసుగులు ధరించమని సలహా ఇచ్చినప్పటికీ మే 5 నుండి 11 వరకు అధికారులు 25,900 కంటే ఎక్కువ కేసులను నమోదు చేయడంతో సింగపూర్ కొత్త COVID-19 వేవ్‌ను చూస్తోంది. మేము అల…

హింసతో దద్దరిల్లుతున్న POK… దిగొచ్చిన పాక్ సర్కార్

పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) హింసతో దద్దరిల్లిపోతోంది. ద్రవ్యోల్బణం వల్ల విద్యుత్, పిండి ధరలు, కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ముజఫరాబాద్ లో ఆందోళనకు దిగిన వారిని పాకిస్థాన్ రేంజర్ లు కాల్చి చంపుతున్నారు. చాలా…

ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ ఆవిష్కరణ

ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్ తో పోలిస్తే ఈ డివైజ్ (నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్ లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు…

మనిషి విలువ రూ.5 లక్షలేనా?: ముంబైవాసులు

బలమైన ఈదురు గాలులకు ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో 14 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ప్రకటించడంపై ముంబైవాసులు మండిపడుతున్నారు. ‘ఓ మనిషి విలువ రూ.5లక్షలేనా? ముంబైలో విచ్చలవిడిగా ఏర్పాటైన హోర్డింగ్స్ను తొలగించి…

నాలుగో విడతలో పోలింగ్ శాతం ఎంతంటే…

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిన్న నాల్గవ దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. రాత్రి 11.45 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో 78.25 శాతం, బిహార్లో 57.06, జమ్మూకశ్మీర్లో…

బీజేపీకి 200 సీట్లు మించవు: ప్రశాంత్ భూషణ్

పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లకు మించి రావని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంచనా వేశారు. బీజేపీని ప్రజలు ‘ప్రజాస్వామ్యానికి ముప్పు’గా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలను జైళ్లకు పంపడంతో పాటు ఎన్నికల సమయంలో నిధులు అందకుండా చేయడం ప్రజల్లో…

నాలుగు రోజుల్లో అండమాన్ను తాకనున్న ‘నైరుతి’

భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు IMD గుడ్ న్యూస్ చెప్పింది. మరో నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన…

ముంబై లో హోర్డింగ్ కూలి, 14మంది కన్నుమూశారు.

ముంబైలో నిన్న ఒక్కసారిగా వచ్చిపడిన గాలివానకు ఘట్కోపర్లో భారీ హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. మొత్తం 88మంది ఈ ఘటనలో గాయపడగా.. వారిలో 14మంది కన్నుమూశారని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రకటించాయి. 74మందిని రక్షించామని తెలిపాయి. ఘటనలో ఈగో మీడియా యజమాని భవేశ్…

TG : పట్టభద్రుల ఉపఎన్నిక బరిలో 52 మంది

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానంలో ఉపఎన్నికకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా 11 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానంలో ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4…

మాల్దీవులకు భారత్ 50 మిలియన్ యూఎస్ డాలర్ల సాయం

మాల్దీవులతో సంబంధాలు క్షీణించినా భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆ దేశ ప్రభుత్వ ప్రత్యేక వినతి మేరకు 50 మిలియన్ యూఎస్ డాలర్ల సాయాన్ని మరో ఏడాది పొడిగించింది. SBI ట్రెజరరీ బిల్స్ E రూపంలో సున్నా శాతం వడ్డీకి ఈ…

శ్రీనగర్ : 35 ఏళ్ల తరువాత రికార్డు స్థాయి పోలింగ్

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లోక్సభ స్థానంలో రాత్రి వరకు 37.98శాతం పోలింగ్ నమోదైంది. 35 ఏళ్లలో ఇదే గరిష్ఠమని అధికారులు తెలిపారు. ఈ ఓటింగ్ పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దుపై ప్రజల నుంచి వచ్చిన…

TG : రుణమాఫీపై మొదలైన కసరత్తు

లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తరుణంలో రుణమాఫీకి సంబంధించిన కసరత్తు మొదలైంది. ఎప్పటిలోగా రుణాలు తీసుకున్నవారికి మాఫీ వర్తిస్తుందో (కటాఫ్) ఇప్పటికే వివరాలు ప్రకటించారు. అయితే కుటుంబంలో ఒక రైతుకు పరిమితం చేస్తారా? లేదా ఎంతమంది తీసుకుంటే అంతమందికి మాఫీ…

HYD : ఫిట్ నెస్ ఉంటేనే.. బడికి బస్సులు

గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రవాణా శాఖ పరిధిలో 11,834 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 70 శాతం బస్సులు ఫిట్నెస్ రెన్యూవల్ చేసుకున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే యాజమాన్యాలపై కఠిన చర్యలు…

AP : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్… ఆ డబ్బులు రిలీజ్ ఎప్పుడంటే?

పోలింగ్ ముగియడంతో వైఎస్సార్ చేయూత, విద్యాదీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం లాంటి పథకాల డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అంటే ఈనెల 14 నుంచే డబ్బులు అకౌంట్లలో వేసుకోవచ్చని ఈసీ అనుమతిచ్చింది. కానీ రెండు రోజులు గడిచిన…

డెంగీకి మరో టీకా

డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగీ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్ కు చెందిన ఔషధ సంస్థ…

ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి: జాన్వీ కపూర్

ప్రేక్షకులు మెచ్చేలా సినిమాలు చేయాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అన్నారు. అలాంటి ఎన్నో సవాళ్లను ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ కోసం ఎదుర్కొన్నానని తెలిపారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ఈ సినిమా కోసం…

T20 World Cup 2024 కు ఉగ్రదాడి భయం!

వెస్టిండీస్ లో జరిగే T20 ప్రపంచకప్ ను ఉగ్రదాడి భయం వెంటాడుతోంది. పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు ఈ మేరకు హెచ్చరికలు చేయడమే దీని కారణం. అయితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఐసీసీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు హామీ ఇచ్చాయి. కాగా..…

మరో టాలీవుడ్ డైరెక్టర్ తో ధనుష్ సినిమా?

తమిళ స్టార్ హీరో ధనుష్ తెలుగు డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. వెంకీ అట్లూరితో ‘సార్’ చేసి హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు శేఖర్ కమ్ములతో ‘కుబేర’ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో ఓ…

AP : మే 15న AP R Set ఫలితాలు

రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్ఎ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఆర్సెట్ 2024-25 పరీక్షలు ముగిశాయి. మొత్తం 10,050 మంది దరఖాస్తు చేసుకోగా, 8,651 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని కన్వీనర్ ప్రొఫెసర్ దేవప్రసాద్ తెలిపారు. ఈనెల 15న ఫలితాలు విడుదల చేస్తామన్నారు.…

అత్యాచారం చేశాడని తప్పుడు కేసు పెట్టిన మహిళకు నాలుగేళ్ల జైలు

తప్పుడు అత్యాచారం కేసు పెట్టిన ఓ మహిళకు కోర్టు జైలుశిక్షతో పాటు రూ.5.88లక్షల జరిమానా విధించింది. యూపీకి చెందిన మహిళ తన కూతురిపై ఓ యువకుడు అత్యాచారం చేశాడని 2019లో ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం జరిగిందని ఆమె కూతురు కూడా…

AP IIIT : ట్రిపుల్ ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

ట్రిపుల్ IT కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్జీయూకేటీ ఛాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. RGUKT ఫరిధిలోని శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు వెల్లడించారు. ఈ నెల 8 నుంచి…

IPL – 2024 : రాజస్థాన్ రాయల్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీకి రెడీ

IPL లో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ జట్టు 10 మ్యాచ్లు ఆడి 8…

AP : ఈ రోజు 3 నియోజకవర్గాల లో CM జగన్ పర్యటన

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రచారం చేయనున్నారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. అక్కడి నుంచి ఆయన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగే బహిరంగ…

ఇకపై రోజుకు 80 వేల మందికి మాత్రమే అయ్యప్ప దర్శనం ట్రావెన్ కోర్ దేవస్థానం

శబరిమల అయ్యప్ప దర్శనానికి ఇకపై రోజుకు 80 వేల మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం తెలిపింది. వచ్చే మండల, మకరవిళక్కు సీజన్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

TG : రాగల 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు …

తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. నేడు రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇక ఇవాళ ఏపీలోని…

జగిత్యాల జిల్లా తీసేస్తా అంటున్నారు: కేసీఆర్

మనందరం ఎన్నో దశాబ్దాలుగా కలగని జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన బస్సుయాత్రలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. జగిత్యాలలో మెడికల్ కాలేజీ వస్తుందని ఏనాడు ఊహించలేదన్నారు. కానీ కాంగ్రెస్…

TG : ఈ రోజు నుంచి రైతు భరోసా నిధుల జమ

యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా (రైతు బంధు) పెండింగ్ బకాయిలను నేటి నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. 3 రోజులపాటు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 వేల కోట్లు…