ముంబైలో నిన్న ఒక్కసారిగా వచ్చిపడిన గాలివానకు ఘట్కోపర్లో భారీ హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. మొత్తం 88మంది ఈ ఘటనలో గాయపడగా.. వారిలో 14మంది కన్నుమూశారని ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రకటించాయి.
74మందిని రక్షించామని తెలిపాయి. ఘటనలో ఈగో మీడియా యజమాని భవేశ్ భిందే సహా పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.