NTR జిల్లా కొండపల్లి శాంతినగర్ వద్ద బుడమేరుకి మూడు చోట్ల గండ్లు పడ్డాయి. వరద ఉధృతి తగ్గడంతో ఇరిగేషన్ అధికారులు గండ్లను పూడుస్తున్నారు.

ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిందిగా మంత్రి లోకేష్ను CMచంద్రబాబు ఆదేశించారు. బుడమేరు కుడి, ఎడమ ప్రాంతాల్లో పడిన గండ్లు గురించి నారా లోకేష్ ఆరా తీశారు. గండ్లు పూడ్చివేత పనులను పర్యవేక్షించడానికి బుడమేరు వద్దకు లోకేష్ బయలుదేరి వెళ్లారు.