యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా (రైతు బంధు) పెండింగ్ బకాయిలను నేటి నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.
3 రోజులపాటు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మరోవైపు అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్లో పంటలు నష్టపోయిన రైతులకూ నేటి నుంచి నష్టపరిహారం పంపిణీ చేయనుంది. ఎకరాకు రూ. 10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.