నీట్ పరీక్ష రాసిన విద్యార్థులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ప్రధాని మోదీ ఆయన మంత్రుల చేతకానితనం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో పేపర్ లీక్ జరగకుండా ఉండేందుకు యువతకు తాను అండగా ఉంటానని తెలిపారు.