ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధనపై విమర్శలు రావడంతో ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా 5 నిమిషాల వరకు ఆలస్యమైనా పరీక్షకు అనుమతించాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

నిన్న ఆదిలాబాద్ గురుకుల కాలేజీ, HYDలో 9 గంటల తర్వాత వచ్చినా పరీక్షకేంద్రంలోకి వెళ్లనిచ్చారు. కాగా, నిన్న ఈ నిబంధన వల్ల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు.