ఫ్రాన్స్ లో చిడో తుఫాన్ భీభత్సం సృష్టించింది. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని తుఫాను తాకడంతో మయోట్ ద్వీపంలో 14మంది మరణించగా, 246మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.
తుఫాన్ ప్రభావంతో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తున్నాయని, గాలులవల్ల భారీగా విద్యుత్ స్తంభాలు, చెట్లు కుప్పకూలాయి. 90ఏళ్లలో మయోట్ ను తాకిన అత్యంత భయంకరమైన తుపాన్ ఇదేనని అధికారులు అంచనా వేశారు.