ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయానికి అనుబంధంగా యువరక్తంతో కొత్త బృందం ఏర్పాటు చేయనున్నారు. వీరికి ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’ అని పేరు పెట్టారు.

పాలనలో సమస్యలు, పథకాల అమలులో లోటుపాట్లు, వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో నేరుగా CMకి నివేదించడం ఈ బృందం ప్రధాన విధి. ‘చీఫ్ మినిస్టర్ ఫెలోస్’ పేరుతో మొత్తం 25మందిని నియమించుకోవాలని నిర్ణయించారు.