ఈ మధ్యకాలంలో ఓటీటీల్లో అదరగొడుతోన్న సిరీస్ లలో హీరమండి: ది డైమండ్ బజార్ ఒకటి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను మెప్పించింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్‌ కు భారీ వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఇది చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఈ వెబ్ సిరీస్ లో చాలా మంది స్టార్ హీరోయిన్స్ నటించారు. భన్సాలీ ‘హిరమండి’ కోసం ఎందరో గొప్ప నటీమణులను ఎంపిక చేశారు. కొందరు నటీమణులు చిన్న చిన్న పాత్రల్లో కూడా సందడి చేశారు. ఇక ఇప్పుడు ఈ సిరీస్ కు సీక్వెల్ రానుందని తెలుస్తోంది.

‘హీరమండి 2’ గురించి సంజయ్ లీల మాట్లాడుతూ.. ‘హీరామండి సీక్వెల్‌లో లాహోర్‌ నుంచి మహిళలు సినీ ప్రపంచంలోకి వచ్చారు. చాలా మంది లాహోర్‌ను విడిచిపెట్టారు. చాలామంది ముంబై చిత్ర పరిశ్రమలో లేదా కోల్‌కతా చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డారు. అయితే, బజార్ వరకు కూడా ప్రయాణం అలాగే ఉంటుంది. ఇక్కడ కూడా డ్యాన్స్ చేసి పాటలు పాడాలి. ఇప్పుడు ఇదంతా నవాబుల కోసం కాకుండా నిర్మాతల కోసం చేయాల్సి వస్తోంది. ఈ సిరీస్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు’ అని అన్నారు.

ఈరోజు (జూన్ 3) సోషల్ మీడియాలో దీని గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ముంబైలో 100 మందికి పైగా డ్యాన్సర్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ‘హీరమండి సెకండ్ సీజన్ 2 వస్తోంది’ అని రాసి ఉంది. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ మెహతా అలాగే తాహా షా బదుషా నటించారు.