IPL లో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రాజస్థాన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది.

ఇప్పటివరకు ఆ జట్టు 10 మ్యాచ్లు ఆడి 8 గెలిచింది. మరోవైపు ఢిల్లీ పడుతూ లేస్తూ తన జర్నీ కొనసాగిస్తోంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడి 5 గెలిచి ఆరింట్లో ఓడిపోయింది. ఇవాళ జరిగే మ్యాచ్ ఢిల్లీకి కీలకంగా మారనుంది.