రీజినల్ రింగురోడ్డు (RRR) నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం భూ సేకరణకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రెవెన్యూ అధికారులు వరుసగా ఆయా గ్రామాల రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి పరిహారం నిర్ణయం కోసం సంప్రదింపులు చేస్తున్నారు.

మార్కెట్ విలువకు మూడు రెట్లు పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతుండగా.. విలువ ఆధారితంగా పరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నట్లు రైతులు తెలిపారు.