భవానీ దీక్షాపరులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. 3 రోజుల్లో 2లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, 8 లక్షలకు పైగా లడ్డూల విక్రయాలు జరిగాయి.
ఈనెల 29న దీక్షల విరమణ ఉండటంతో భారీగా లడ్డూల తయారీతో పాటు అన్నదానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 3వ రోజైన సోమవారం 63 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. TG, కర్ణాటక, TN నుంచి సైతం భవానీ దీక్షాధారులు వస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.