గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. రోజురోజు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఠారెత్తిస్తున్నాయి.. ఢిల్లీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలలో48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఎండల తీవ్రత, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైడ్రేటెడ్ గా ఉండటానికి మీరు కూడా చెరకు రసం తాగే వారికి వైద్య నిపుణులు హెచ్చరిక జారీ చేశారు. ఈ సమయంలో చెరకు రసం తాగడం ఆరోగ్యానికి హానికరమని ICMR ప్రకటించింది.

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎక్కడికక్కడ జ్యూస్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ సీజన్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న జ్యూస్ చెరకు రసం. మండే వేడిలో చల్లటి చెరకు రసానికి మంచి డిమాండ్ ఉంటుంది.. ఇది రుచికరంగా ఉన్నప్పటికీ.. ప్రమాదకరమని ఐసీఎంఆర్ ప్రకటించింది. వాస్తవానికి, ఉపశమనం కల్పించినప్పటికీ.. శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని చెప్పింది.

ఇలాంటి పరిస్థితుల్లో చెరకు రసాన్ని తక్కువ పరిమాణంలో తాగాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రజలకు సూచించింది. అంతే కాదు, చల్లటి పండ్ల రసాలు, శీతల పానీయాలు, టీ, కాఫీలను ఎక్కువ పరిమాణంలో తీసుకోవద్దని కూడా సూచించబడింది.

చెరకు రసం ఎందుకు ఆరోగ్యకరం కాదు?

ICMR జారీ చేసిన సలహాలో, చెరకు రసంలో చాలా చక్కెర ఉందని చెప్పింది. అధ్యయనాల ప్రకారం, 100 ml చెరకు రసంలో 13 నుండి 15 గ్రాముల చక్కెర ఉంటుంది. పెద్దలకు 30 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర, 7 నుండి 10 సంవత్సరాల వయస్సు పిల్లలకు 24 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర రోజువారీ వినియోగం ఆరోగ్యానికి హానికరం.

చెరకు రసం ప్రతికూలతలు

డయాబెటిక్ రోగులకు చెరుకు రసం తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. ఎందుకంటే ఇందులో చక్కెర పరిమాణం చాలా ఎక్కువ.
చక్కెరను జీర్ణం చేయడానికి శరీరానికి ఎక్కువ నీరు అవసరం కాబట్టి అదనపు చక్కెరను తీసుకోవడం వల్ల నీటి నష్టాన్ని పెంచుతుంది.
చక్కెర పానీయాలు శరీరంలోని కేలరీల పరిమాణాన్ని పెంచుతాయి. ఇది బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. దీనివల్ల మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధుల నిర్వహణ కష్టమవుతుంది.

ఈ పానీయాలు కూడా హానికరం

ICMR కూడా ఏదైనా పండ్ల రసాన్ని మితంగా తీసుకోవాలని.. ముఖ్యంగా చక్కెరను జోడించవద్దంటూ సూచించింది. బదులుగా, మొత్తం పండ్లను తినడం, ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఫైబర్, ఇతర పోషకాలు కూడా పండ్లలో ఉంటాయి. అంతే కాకుండా టీ, కాఫీ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం మానేయాలి. అయితే, తక్కువ పరిమాణంలో టీ లేదా కాఫీ తాగడం వల్ల ఎటువంటి హాని ఉండదు.