ఒడిశాలో నవీన్ పట్నాయక్ శకం ముగిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిజూ జనతాదళ్ ఓటమి పాలయ్యింది. ఒడిశాలో తొలసారి కాషాయం జెండా రెపరెపలాండింది. బీజేపీకి అక్కడ 81 సీట్లు లభించాయి. బీజేడీకి కేవలం 47 సీట్లు మాత్రమే లభించాయి. కాంగ్రెస్ 15, ఇతరులు 4 లీడ్ లో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా బీజేడీ సత్తా చాటలేకపోయింది.. 21 లోక్‌సభ స్థానాల్లో 1 దానిలో మాత్రమే లీడ్ లో ఉంది.. 19 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. 1 దానిలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది..
ఒడిశాకు 2000 నుంచి 2024 వరకు ఐదుసార్లు సీఎంగా సేవలందించారు నవీన్ పట్నాయక్ . వయోభారం మీద పడినప్పటికి గతంలో ఎన్నడు లేని విధంగా పార్టీ అభ్యర్దుల తరపున ప్రచారం చేశారు. అయినప్పటికి ఆయన పార్టీ ఓడిపోయింది. ముఖ్యంగా బీజేడీ పగ్గాలను మాజీ ఐఏఎస్ అధికారి పాండ్యన్ చేపడుతారని బీజేపీ చేసిన ప్రచారం బాగా పనిచేసింది. భూమి పుత్రుడికే ఒడిశా సీఎం పగ్గాలు అప్పగిస్తామని పదేపదే ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు ప్రధాని మోదీ , అమిత్‌షా .
ఒడిశా అసెంబ్లీ ఫలితాలు.. ఇప్పటివరకు ట్రెండ్స్ ప్రకారం..
బీజేపీ 4 సీట్లలో గెలుపొంది.. 76 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
బీజేపీ 1 స్థానంలో గెలుపొంది.. 47 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది.
కాంగ్రెస్ 1 స్థానంలో గొలుపొంది.. 14 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది.