సీఎం చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో పర్యటించన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతోపాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో వివిధ కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును సీఎం సందర్శిస్తారు.