కొత్త మద్యం పాలసీ తెచ్చేందుకు ఏపీ సర్కారు కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం చేయాలా? లేక యాధాతధంగా కొనసాగించి బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తేవడమా? అనే అంశాలపై చర్చ జరుపుతోంది.

గత ఐదేళ్లుగా మద్యం అమ్మకాలు, బ్రాండ్లు, కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఎక్సైజ్ శాఖను ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.