బలమైన ఈదురు గాలులకు ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో 14 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు పరిహారం ప్రకటించడంపై ముంబైవాసులు మండిపడుతున్నారు.

‘ఓ మనిషి విలువ రూ.5లక్షలేనా? ముంబైలో విచ్చలవిడిగా ఏర్పాటైన హోర్డింగ్స్ను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడండి’ అని సూచిస్తున్నారు. సాధారణంగా రూ.2 లక్షలిచ్చేవారని, ఎన్నికలని పరిహారం పెంచారని సెటైర్లు వేస్తున్నారు.