తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. అన్ని కంపార్ట్మెంట్లూ నిండిపోవడంతో బయటి వరకు క్యూ ఉంది.

సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న మాఘ శుద్ధ పూర్ణిమ, శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని టీటీడీ వర్గాలు తెలిపాయి.

కాగా.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.74 కోట్లుగా ఉంది. 72,175మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.