సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. జనవరి 12న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.
ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. యూట్యూబ్లో కుర్చీ మడతపెట్టి లిరికల్ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.