దేశంలోనే ఉత్తమ విద్యాసంస్థగా మరోసారి ‘ఐఐటీ మద్రాస్’ నిలిచింది. ఈ జాబితాలో టాప్లో నిలవడం ఈ సంస్థకు ఇది వరుసగా ఆరో సారి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్(NIRF) కింద కేంద్ర విద్యాశాఖ జాబితా రూపొందించింది.

ఓవరాల్ టాప్ 10 జాబితాలో ఎనిమిది ఐఐటీలు, ఎయిమ్స్ ఢిల్లీ, జేఎన్ఐూకు చోటు దక్కింది. విశ్వవిద్యాలయాలపరంగా… ఐఐఎస్సీ బెంగళూరుకు తొలిస్థానంలో నిలిచింది.