ప్రపంచంలోని అత్యంత భారీ బాడీ బిల్డర్ గా గుర్తింపు పొందిన ఇల్లియా ‘గోలెమ్’ యెఫించిక్ (36) గుండెపోటుతో మరణించారు.

ఆయనను ‘ది మ్యుటెంట్’ అని ముద్దుగా పిలుస్తారు. 6 అడుగుల ఎత్తు, 340 పౌండ్ల బరువు గల ఆయన ప్రపంచంలో అత్యంత భయంకరమైన బాడీ బిల్డర్(బాహుబలుడి)గా పేరు సంపాదించినప్పటికీ ఎన్నడూ ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. యెఫించిక్ కండలు 25 అంగుళాల చుట్టుకొలత కలిగి ఉండేవి.