నైపుణ్యం కలిగిన 2.16 లక్షల మంది ప్రముఖులు 2023లో భారత పౌరసత్వాన్ని వదులుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేశ్ తెలిపారు.

రాజ్యసభలో కేంద్రమంత్రి కీర్తివర్ధన్సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారన్నారు. విద్యావంతులు, వ్యాపారవేత్తలు భారత పౌరసత్వాన్ని వదులుకుని అమెరికా, బ్రిటన్, సింగపూర్ తదితర దేశాలకు వలస వెళ్లారని తెలిపారు. దీని ద్వారా దేశానికి తీవ్రమైన ఆర్థిక నష్టం ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.