యానిమల్ సినిమాను తాను చూడలేదని, అది తనకు సరిపోయే మూవీ కాదని ప్రముఖ నటి ఖుష్బూ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘యానిమల్ లాంటి సినిమాలు హిట్టవుతున్నాయంటే మనం ప్రజల మైండ్సెట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.

అందరూ లింగ సమానత్వం, మహిళలకు గౌరవం గురించి మాట్లాడతారు. మళ్లీ యానిమల్ లాంటి సినిమాలు చూసి బాగుందంటారు. వారి మైండ్లో ఏముందో అర్థం కావట్లేదు’ అని చెప్పారు.