దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గి 60 ఏళ్లు పైబడినవారి జనాభా పెరగనుంది. దేశ జనాభా 140 కోట్లు కాగా 2036 నాటికి 152.20 కోట్లకు చేరనుంది.

ఈ మేరకు దేశ జనాభా పెరుగుదలపై తాజా అంచనాలతో ‘భారతదేశంలో మహిళలు-పురుషులు 2023’ నివేదికను కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ విడుదల చేసింది.