తెలంగాణ గవర్నర్ గా ఏపీ బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం ఉపందుకుంది.

రాష్ట్ర రాజకీయాలపై పూర్తి అవగాహన ఉండటంతో పాటు ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా చేశారు. దీంతో ఆయనకు గవర్నర్ బాధ్యత కట్టబెట్టాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అయితే రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన్ను గవర్నర్గా నియమిస్తే రాజకీయంగా వ్యతిరేకత వస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి.