ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజీవాలకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఢిల్లీ మద్యం పాలసీపై సీబీఐ నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం తిరస్కరించింది.

తన అరెస్టును సవాల్ చేస్తూ కేజీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం సీబీఐని ఆదేశించింది.