గత మూడు నెలలుగా రికార్డు స్థాయి ఎండలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులకు ఉపశమనం లభించింది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది.
24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. 1936 తర్వాత జూన్ నెలలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని పేర్కొంది.