మాల్దీవులతో సంబంధాలు క్షీణించినా భారత్ ఆపన్న హస్తం అందించింది. ఆ దేశ ప్రభుత్వ ప్రత్యేక వినతి మేరకు 50 మిలియన్ యూఎస్ డాలర్ల సాయాన్ని మరో ఏడాది పొడిగించింది.
SBI ట్రెజరరీ బిల్స్ E రూపంలో సున్నా శాతం వడ్డీకి ఈ నిధులు మంజూరు చేసింది. రెండు దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహానికి ఇది చిహ్నం అని మాల్దీవుల విదేశాంగ మంత్రి జమీర్ తెలిపారు. ఈ నిధులతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటామన్నారు.