స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్లను పున: ప్రారంభించిన విషయం తెలిసిందే.

గిరిజనులకు పౌష్ఠికాహారం అందుబాటులో ఉండేలా.. ప్రతి గిరిజన మండల కేంద్రంలో ఒక అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. దీంతో గిరిజనులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన భోజనం లభించనుంది.