UPలోని అయోధ్యలో బాల రాముడిని దర్శించుకునేందుకు రోజూ లక్షల్లో భక్తులు వస్తున్నారు. దీంతో రోజూ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు రాముడికి విశ్రాంతినిచ్చేలా దర్శనాలకు విరామం ఇవ్వనున్నట్లు ఆలయ పూజారి సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
కాగా ప్రస్తుతం తెల్లవారుజామున 4 గంటలకే సుప్రభాత సేవలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు రాముడి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.