ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చేలా చేసి.. సీఎం అయిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీలోనూ అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తీసుకున్నట్లు తెలుస్తోంది.

నెలాఖరులోపు విశాఖపట్నంలో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా వచ్చే అవకాశముందని సమాచారం.