కోల్ కత్తా వైద్యురాలి హత్యాచార కేసుపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారంలోగా ఈ కేసుపై దర్యాప్తు అఫిడవిట్ ను దాఖలు చేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాలని 10 మంది డాక్టర్లతో టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఘటన తర్వాత 12 గంటలు ఆలస్యంగా ఎఫ్ఎఆర్ ఎందుకు నమోదు చేశారని సుప్రీం ప్రశ్నించింది.