రాష్ట్ర రాజధాని అమరావతి రైలు మార్గం అనుసంధానం కోసం రూ.2,047 కోట్లతో 56 కిలోమీటర్ల రైల్వేలైన్ కు సంబంధించిన DPR (సవివర ప్రాజెక్టు నివేదిక)కు రైల్వేబోర్డు అమోదం తెలిపిన తర్వాత నీతి ఆయోగ్ ఆమోదముద్ర వేసిందని మండల రైల్వే అధికారి(DRM) రామకృష్ణ తెలిపారు.

53 మార్గంలో కృష్ణానదిపై ఒక భారీ వంతెన కూడా నిర్మిస్తున్నామన్నారు. గుంటూరు – బీబీనగర్ రెండో లైను నిర్మాణానికి రూ.2,853 కోట్లు మంజూరయ్యాయన్నారు.