చంద్రయాన్ 4, 5 డిజైన్లు పూర్తి చేసినట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.
2028లో చంద్రయాన్-4 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. చంద్రుడి నుంచి మట్టి, రాళ్లు భూమికి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ఇస్రో మొత్తం 70 ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టనుంది.