ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీలు/ అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.

ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్య కలాపాల్లో పాల్గొన్నా, పార్టీల నుంచి బహుమతులు తీసుకున్నా చర్యలు తప్పవంది. ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయకూడదని స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులు అందితే తగిన చర్యలు చేపడతామంది.