ఇప్పుడు కాలం మారింది. అందరూ హై ఫ్యాషన్‌గా ఉండేందుకు ఇష్ట పడుతున్నారు. ఇందుకు అనేక మెరుగు దిద్దుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో టైల్స్ అనేవి ఖచ్చితంగా మారాయి. ఇంటి బాల్కానీ నుంచి.. బాత్రూమ్ వరకూ రకరకాల టైల్స్ వచ్చాయి. వీటిల్లో ఎన్నో డిజైన్స్ ఉన్నాయి. ఎవరికి నచ్చినవి వాళ్లు తీసుకుంటూ ఉంటారు. టైల్స్ వేసుకున్నంత మాత్రాన సరిపోతుందా.

వాటిని క్లీన్ చేయడం కూడా పెద్ద టాస్కే. ఇంట్లో, బాత్రూమ్ సైడ్స్, డోర్ అంచులను ఎవరూ పట్టించుకోరు. వీటిని అలాగే వదిలేస్తే మొండి మరకలుగా మారిపోతాయి. మూలల్లో కూడా శుభ్రం చేస్తూ ఉండాలి. టైల్స్‌పై ఉండే మురికి, మచ్చలు త్వరగా పోవాలంటే.. ఈ టిప్స్ మీకు చక్కగా హెల్ప్ చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

సోడా:

ఇంట్లో టైల్స్ అయినా.. బాత్రూమ్‌లోని టైల్స్‌పై ఒక్కోసారి మరకలు పడి.. మచ్చలుగా ఉండిపోతాయి. చాలా మంది వీటిని అస్సలు పట్టించు కోరు. కానీ వీటిని అలాగే వదిలేస్తే.. మరకలుగా ఉండిపోతాయి. సోడా సహాయంతో ఈ మరకలను తగ్గించుకోవచ్చు. కొద్దిగా నీటిలో సోడా వేసి స్క్రబ్ సహాయంతో రుద్దండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే.. మురికి త్వరగా వదిలి పోతుంది.

కూల్ డ్రింక్స్:

తాగే కూల్ డ్రింక్స్ సహాయంతో కూడా మురికిని వదిలించుకోవచ్చు. వీటితో కూడా టైల్స్‌పై ఉండే మురికి, మరకలు పోతాయి. టైల్స్ పై కొద్దిగా కూల్ డ్రింక్స్ వేసి వెంటనే బ్రష్ సహాయంతో రుద్దాలి. లేదంటే మాత్రం మరకలు అలానే ఉండిపోతాయి.

నిమ్మకాయలు:

నిమ్మకాయలతో కూడా మరకలు, మచ్చలను వదిలించుకోవచ్చు. మురికిని శుభ్రం చేయడంలో నిమ్మకాయలు ఎంతో చక్కగా హెల్ప్ చేస్తాయి. ఒక బౌల్ లోకి కొద్దిగా నిమ్మరసం, బేకింగ్ సోడా లేదంటే సర్ఫ్ అయినా తీసుకుని మీరు టైల్స్‌ని క్లీన్ చేయవచ్చు. వీటితో క్లీన్ చేస్తే మంచి సువాసనతో పాటు మురికి కూడా పోతుంది.

బేకింగ్ సోడా:

ఇంటిని క్లీన్ చేయడంలో చక్కగా సహాయ పడుతుంది బేకింగ్ సోడా. ఇప్పటికే బేకింగ్ సోడాతో ఇంటిని క్లీన్ చేసేందుకు ఎన్నో రకాల చిట్కాలు తెలుసుకున్నాం. బకెట్‌లోకి గోరు వెచ్చటి నీటిని తీసుకుని.. అందులో బేకింగ్ సోడా, కొద్దిగా సర్ఫ్ వేసి బాగా మిక్స్ చేయండి. ఈ నీటితో ఇల్లు కిచెన్ ఎక్కడ ఏం క్లీన్ చేసినా.. మెరవాల్సిందే.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు మా సైట్ బాధ్యత వహించదు.)