తెలంగాణలో కమలం పార్టీ పెర్ఫామెన్స్ పెరిగింది. గత పార్లమెంటు ఎన్నికల కన్నా.. ఈసారి డిజిట్ డబుల్ అయింది. నాలుగు నుంచి ఎనిమిది స్థానాలకు కాషాయపార్టీ ఎగబాకింది. దీనికి అనేక కారణాలున్నా.. ప్రధాన కారణం కిషన్ రెడ్డి. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ మరింత దూకుడుగా వెళ్లింది.
అసెంబ్లీలో ఎనిమిది స్థానాలు సాధిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు సాధించడం మామూలు విషయం కాదు. మోదీ హవా.. కిషన్ రెడ్డితోపాటు.. కాషాయపార్టీ లోయర్ క్యాడర్ చురుగ్గా పనిచేయడంతో ఇన్ని సీట్లు సాధించగలిగింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40శాతం ఓట్లు వస్తే.. బీజేపీ 35శాతం ఓట్లు సాధించింది. ఈ ఓట్లన్నీ ఉత్తర తెలంగాణ, గ్రేటర్ హైదరాబాద్‌లోనే వచ్చాయి. బీఆర్‌ఎస్ 17శాతం లోపు ఓట్లకే పరిమితం అయింది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించడమేకాకుండా.. మంచి స్ట్రాటజీతో.. పర్ఫెక్ట్ క్యాండిడేట్ సెలక్షన్‌తో
మిగిలిన నియోజకవర్గాల్లోనూ సత్తా చూపించారు. మల్కాజ్‌గిరి, చేవెళ్ల, మెదక్, మహబూబ్‌నగర్ స్థానాలను కైవసం చేసుకోవడంలో కిషన్ కీలకపాత్ర పోషించారు. బూత్‌స్థాయి నుంచి కేడర్‌ను ఉత్తేజపరుస్తూ.. వారికి దిశానిర్థేశం చేస్తూ ముందుకెళ్లారు కిషన్. పదేళ్ల క్రితం బీజేపీ పరిస్థితికి.. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితికి చాలా తేడా ఉంది. అప్పుడు అసెంబ్లీలోనే ఒక సీటు సాధించేందుకు తంటాలుపడ్డ కాషాయపార్టీ.. ఇప్పుడు గౌరవప్రద స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ ప్రజలందరికీ కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నరేంద్రమోదీని, అభివృద్ధిని చూసి మరోసారి పట్టం కట్టారంటూ కిషన్ రెడ్డి తెలిపారు. తొలిసారిగా తెలంగాణలో 8 స్థానాలు గెలిచి రికార్డు సాధించామన్నారు. డబుల్ డిజిట్ రావాలన్న ఆకాంక్షతో పనిచేశామని.. రెండు, మూడు స్థానాల్లో గెలివాల్సి ఉందని.. కానీ కొన్ని కారణాలతో ఓడిపోయామని తెలిపారు.