కరీంనగర్ లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తన ప్రచార డిజిటల్ రథాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, తదితరులు ఉన్నారు.