అనుమానాస్పద స్థితిలో చిరుతపులి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని జాదరావుపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. తాటిగట్టు సమీపంలోని రాయంచెరువు వద్ద గురువారం రాత్రి చిరుతపులి మృతి చెందినట్లుగా గ్రామస్తులు గుర్తించారు.
సమాచారం అందుకున్న ఫారెస్ట్ సెక్షన్ అధికారి లక్ష్మణ్ నాయక్ రాత్రివేళ కావడంతో ఘటనా స్థలానికి వెళ్లలేకపోయారు. విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.