పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) హింసతో దద్దరిల్లిపోతోంది. ద్రవ్యోల్బణం వల్ల విద్యుత్, పిండి ధరలు, కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు.
ముజఫరాబాద్ లో ఆందోళనకు దిగిన వారిని పాకిస్థాన్ రేంజర్ లు కాల్చి చంపుతున్నారు. చాలా మందికి గాయాలయ్యాయి. నిరసనకారుల దెబ్బకు దిగొచ్చిన పాక్ ప్రభుత్వం POK కి 82.6 మిలియన్ డాలర్ల నిధులను ప్రకటించింది.