భారీ వర్షాల కారణంగా త్రిపురలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అక్కడి నాలుగు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. అందులో మొత్తం ఏడుగురు మృతి చెందారు.
అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. సౌత్ త్రిపుర జిల్లాలో ఐదుగురు, గోమతి, కోవై జిల్లాలో ఒక మరణం చొప్పున సంభవించాయి. అలాగే, గోమతి, కోవై జిల్లాలో ఒకరు చొప్పున గల్లంతు అయ్యారు.