రాష్ట్రంలో దేవాదాయ భూములు కాపాడతామని మంత్రి కొండా సురేఖ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల లో ఆదివారం ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాలకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. మాన్యాలను కాపాడేందుకు దేవాదాయ శాఖ చట్టాలను సవరించనున్నట్లు తెలిపారు. దేవాదాయ శాఖ భూముల లో మహిళా సంఘాలతో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, ఆయిల్పామ్ తోటల పెంపకం చేపట్టనున్నట్లు చెప్పారు.