స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించి రిజర్వేషన్లు ఖరారు చేస్తామని తెలిపారు.

ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆరు రోజుల క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓటర్ జాబితా వచ్చిందని తెలిపారు. దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపొందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.