అమెరికా ఉద్యోగం కోసం విదేశీయులు పెట్టుకునే ఆశలను అక్కడి టెక్ కంపెనీలు అడియాశలు చేస్తున్నాయి.

H1Bవీసా స్పాన్సర్షిప్లను భారీగా తగ్గిస్తున్నాయి. తమ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా సంస్థలు H1Bవీసాలను స్పాన్సర్ చేస్తాయి.

ఈ వీసాలు ఉంటే ఆరేళ్లపాటు అమెరికాలో స్పాన్సర్ చేసిన కంపెనీలో పనిచేసే వీలుంటుంది. అయితే, 2023తో పోల్చితే 2024లో H1Bవీసా స్పాన్సర్షిప్లను పెద్ద టెక్ కంపెనీలు భారీగా తగ్గించేశాయి.