పర్యాటక రాజధానిగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలనే ఏపీ ప్రభుత్వ ఆలోచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టినట్టారు. సందర్శకుల కోసం కైలాసగిరిపై స్కై సైకిలింగ్, జిన్లైనర్ ను ఏర్పాటు చేశారు.

జల విన్యాసాలపై ఆసక్తి ఉన్నవారి కోసం రుషికొండ బీచ్లో చాలాకాలం తర్వాత మళ్లీ స్కూబా డైవింగ్ అందుబాటులోకి వచ్చింది. ఆకాశంలో విహరించేందుకు వారం కిందటే పారామోటార్ కూడా అందుబాటులోకి తెచ్చారు.