క్యాంపస్ సెలక్షన్లలో గత ఏడాది అమ్మాయిలదే హవా సాగినట్లు హైరై సంస్థ వెల్లడించింది. సెలక్ట్ అయిన ప్రతీ ముగ్గురు అభ్యర్థుల్లో ఒక అమ్మాయి ఉందని తెలిపింది.

2023లో సంస్థలు ఎంపిక చేసిన ఫ్రెషర్లలో 40% మంది అమ్మాయిలే ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 5% ఎక్కువ. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, రీసెర్చ్ & డెవలప్మెంట్ రంగాలకు సంబంధించిన నియామకాల్లో ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నట్లు తెలిపింది.