ఈ నెల 22వ తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ కు రానున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ‘లోకమంథన్-2024’ లో వందల మంది గిరిజన కళాకారులు పాల్గొని వారి చేతి వృత్తులను ప్రదర్శిస్తారన్నారు.

“మొదటిసారి మన భాగ్యనగరం ఈ వేడుకకు వేదిక కావడం హర్షణీయం. 22న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభిస్తారు”అని కిషన్ రెడ్డి వివరించారు.