పోలింగ్ ముగియడంతో వైఎస్సార్ చేయూత, విద్యాదీవెన, ఆసరా, ఈబీసీ నేస్తం లాంటి పథకాల డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

పోలింగ్ ముగిసిన వెంటనే అంటే ఈనెల 14 నుంచే డబ్బులు అకౌంట్లలో వేసుకోవచ్చని ఈసీ అనుమతిచ్చింది. కానీ రెండు రోజులు గడిచిన ప్రభుత్వం 14 వేల కోట్ల నిధులను విడుదల చేయలేదు. ఈ డబ్బులను సోమవారం నుంచి రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.