బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో శ్రద్ధా కపూర్. ఆషికీ 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో ఈ బ్యూటీకి మరింత క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. నార్త్ లోనే కాకుండా సౌత్ లోనూ ఈ హీరోయిన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమాతో సౌత్ అడియన్స్ ముందుకు వచ్చింది శ్రద్ధా. డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ మూవీ భారీ ఎత్తున విడుదలైంది. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమాతో దక్షిణాదిలోకి అడుగుపెట్టిన శ్రద్ధ నటనకు తెలుగు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ మూవీతో బాలీవుడ్ బ్యూటీకి మంచి మార్కులు పడ్డాయి. సాహో సినిమాలో ప్రభాస్, శ్రద్దా జోడి ఆకట్టుకుంది. సాహో తర్వాత తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ శ్రద్ధా మాత్రం ఇటు తెలుగు, అటు హిందీలో సైలెంట్ అయ్యింది.
కొన్నాళ్లుగా శ్రద్ధా అటు హిందీ సినీ పరిశ్రమలోనూ అంతగా యాక్టివ్ గా కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ప్రభాస్ తో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారు.. ? మీ ఇద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారు..? అని అడిగాడు ఓ నెటిజన్.
ఇందుకు శ్రద్ధా స్పందిస్తూ.. ప్రభాస్ మళ్లీ తన ఇంటి నుంచి ఎప్పుడు భోజనం పంపిస్తే అప్పుడే నటిస్తాను అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం శ్రద్ధ చేసిన కామెంట్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ పంపించిన ఫుడ్ శ్రద్దాకు తెగ నచ్చినట్లుంది.. మరీ ఇంత ఫుడీలా ఉందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సాధారణంగా తనతోపాటు కలిసి నటించే నటీనటులకు ప్రభాస్ ఇంటి నుంచి భోజనం పంపిస్తాడని తెలిసిందే. సినిమా షూటింగ్ సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హోమ్ ఫుడ్ పెట్టిస్తాడని.. అందరికీ ప్రేమగా వడ్డిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇదివరకు చాలా మంది హీరోయిన్స్, క్యారెక్టర్స్ ఆర్టిస్టులు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి శ్రద్ధా ప్రభాస్ హోమ్ ఫుడ్ గురించి కామెంట్ చేయడంతో డార్లింగ్ తన తోటి నటీనటులను ఎలా గౌరవిస్తాడో అర్థమవుతుంది.