ఇంటర్ లో ఆన్లైన్ అడ్మిషన్లకు రంగం సిద్ధమవుతుంది. డిగ్రీ అడ్మిషన్లకు అనుసరిస్తున్న ‘దోస్త్’ తరహాలోనే ఇంటర్ లో జూనియర్ కాలేజీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (జోస్త్) విధానాన్ని తీసుకురానున్నారు.
పదో తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ను బట్టి, విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్ల ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. డిగ్రీ సీట్లను ‘దోస్త్’ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇదే తరహాలో ఇంటర్ లోనూ అడ్మిషన్లు కల్పించనున్నారు.